: వాట్సాప్ లో తెలంగాణ పోలీస్ విభాగం
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునేందుకు తెలంగాణ పోలీస్ విభాగం ఆసక్తి చూపుతోంది. ఇప్పటికే ఫేస్ బుక్, ట్విట్టర్, హ్యాక్ ఐ వంటి యాప్ లను ఉపయోగిస్తోంది. తాజాగా స్మార్ట్ ఫోన్ అప్లికేషన్ వాట్సాఫ్ సేవలను కూడా ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ వాట్సాప్ సేవలను అధికారికంగా ప్రారంభించారు. 9490617444 నంబర్ కు ప్రజలు వాట్సాప్ ద్వారా ఫిర్యాదులను పంపచ్చని ఆనంద్ కోరారు. ఏదైనా సంఘటన జరిగిన సమయంలో ఫోటోలు, సాదారణ సందేశాలు కూడా పంపాలన్నారు. అంతేగాక పోలీస్ విభాగానికి చెందినవారు ఏదైనా అవినీతి, అక్రమాలకు పాల్పడితే వారి ఫోటోలను కూడా దీని ద్వారా పంపాలని కమిషనర్ వివరించారు.