: టీటీడీని నిధులడిగిన చంద్రబాబు


తిరుపతి పట్టణంలో తాగునీటి సమస్య అధికంగా ఉన్నందున, సమస్య పరిష్కారం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం కల్పించుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. తాగునీటి సౌకర్యం కల్పించడం కోసం రూ.25 కోట్లు ఇవ్వాలని టీటీడీని కోరినట్టు ఆయన తెలిపారు. తిరుపతిలో అక్రమ కట్టడాలకు తావు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించానని, రేణిగుంటలో అంతర్జాతీయ విమానాశ్రయం కోసం మరింత భూమి సేకరిస్తామని సీఎం తెలిపారు. నేరాలను అరికట్టేందుకు మరిన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని వివరించారు.

  • Loading...

More Telugu News