: అమ్మవారి దర్శనంలో ఆలస్యం... ఆలయ ఈఓపై వైసీపీ ఎమ్మెల్యే బూతు పురాణం!


జాతరకొచ్చిన తనకు అమ్మవారి దర్శనాన్ని త్వరగా ఇప్పించలేదన్న కారణంగా వైసీపీ నేత, రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి విచక్షణ కోల్పోయారు. ఆలయ ఈఓపై తిట్ల దండకం అందుకున్నారు. అసలే జాతర. పోటెత్తిన భక్తులు. ఏర్పాట్లలో నిమగ్నమైన సదరు అధికారి ఎమ్మెల్యే తిట్ల దండకంతో కన్నీరు పెట్టారు. కడప జిల్లా లక్కిరెడ్డిపల్లిలో గురువారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ఘటనలో ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి బూతు పురాణం వినిపించారట. ‘‘ప్రొటోకాల్ పాటించవు. ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నావు. పద్ధతులు మార్చుకో. లేకపోతే కష్టమే’’ అంటూ ఈఓపై కేకలేయడంతో పాటు తిట్ల దండకం అందుకున్నారు.

  • Loading...

More Telugu News