: యువరాజ్ సింగ్ తో డేటింగ్ వార్తలపై ప్రీతీజింటా మండిపాటు


బాలీవుడ్ నటి, నిర్మాత ప్రీతీజింటా దేనికీ భయపడదు. గతంలో వ్యాపారవేత్త నెస్ వాడియాతో ప్రేమాయణం, గతేడాది ఐపీఎల్ సమయంలో వివాదం, అతనిపై కేసు పెట్టడం... ఇలా అన్నింటిలోనూ అమ్మడు ధైర్యంగా ప్రవర్తించింది. తాజాగా క్రికెటర్ యువరాజ్ సింగ్ తో తను డేటింగ్ చేస్తోందంటూ మీడియాలో వార్తలొస్తున్నాయి. వెంటనే ప్రీతి వాటిని ట్వీట్టర్ ద్వారా ఖండించేసింది. "ఇటువంటి వ్యాఖ్యలు లింగవివక్షకు, చౌకబారుతనానికి నిదర్శనం. 'యువరాజ్, ప్రీతి మధ్య సంబంధం' అనే రాతలకు దయచేసి దూరంగా వుండండి" అని ప్రీతి కోరింది. అంతేకాదు "డియర్ మీడియా (ప్రత్యేకంగా అంతర్జాతీయ బిజినెస్ టైమ్స్) యువరాజ్ సింగ్ తో నేనెప్పుడూ డేట్ చేయలేదని లేదా డేటింగ్ చేయాలనుకోవడం లేదని ఎన్నిసార్లు చెప్పాలి?" అంటూ ఘాటుగా స్పందించింది.

  • Loading...

More Telugu News