: జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక హోదా హామీ ఇవ్వకుంటే ప్రభుత్వం ఏర్పాటు చేయం: ముఫ్తీ


అసెంబ్లీ ఎన్నికలు జరిగి నెలలు గడుస్తున్నా జమ్ము కాశ్మీర్ లో ప్రభుత్వం ఏర్పాటుకాకపోవడం గమనార్హం. అయితే, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ లిఖిత పూర్వక హామీ ఇస్తేనేగానీ ప్రభుత్వం ఏర్పాటు చేయమని పీడీపీ అధినేత ముఫ్తీ మహ్మద్ సయిీద్ స్పష్టం చేశారు. 370వ అధికరణ కింద రాష్ట్రానికి ఇచ్చిన ప్రత్యేక అధికారానికి ప్రత్యేక హోదా ఏమీ భంగం కాదన్నారు. తాను అధికారంపై ఆసక్తి చూపడం లేదని, సీఎం కుర్చీ కోసమే బిచ్చమెత్తడం లేదని ఓ ఆంగ్ల పత్రిక ఇంటర్వ్యూలో ముఫ్తీ ఈ విధంగా మాట్లాడారు.

  • Loading...

More Telugu News