: ఇండియా టుడే తెలుగు వార పత్రిక క్లోజ్... దక్షిణాది భాషల్లో పత్రికను ఇవ్వలేమన్న యాజమాన్యం
ఇకపై ఇండియా టుడే వార పత్రిక తెలుగులో లభించదు. తెలుగుతో పాటు దక్షిణాది ప్రాంతీయ భాషల్లో పత్రికను వెలువరించలేమని పత్రిక యాజమాన్యం ప్రకటించింది. అరవింద్ కేజ్రీవాల్ ఘన విజయంపై కవర్ పేజీ కథనంతో వచ్చిన ఇండియా టుడే వార పత్రిక నిన్న మార్కెట్ లోకి వచ్చింది. దక్షిణాది భాషలకు సంబంధించి తుది సంచిక ఇదేనంటూ పత్రిక యాజమాన్యం నిన్నటి సంచికలో వెల్లడించింది. తొలుత ఇంగ్లీష్ లోనే మొదలైన ఇండియా టుడే, ఆ తర్వాత ప్రాంతీయ భాషలకూ విస్తరించింది. దాదాపు 24 ఏళ్ల పాటు తెలుగు, తమిళం, మళయాళం తదితర భాషల్లో ఆ పత్రిక అశేష పాఠకాదరణ పొందింది. దక్షిణాది భాషలకు సంబంధించిన ఎడిషన్లను నిలిపివేస్తున్నట్లు ఇండియా టుడే యాజమాన్యం చేసిన ప్రకటన తెలుగు పాఠకులను షాక్ కు గురి చేసింది.