: ఢిల్లీలో అధికార కార్యాలయం ఖాళీ చేయాలని కాంగ్రెస్ కు మోదీ సర్కారు నోటీసులు
న్యూఢిల్లీ నడిబొడ్డున 24 అక్బర్ రోడ్డులో ఏళ్ల తరబడి కాంగ్రెస్ అధికార కార్యాలయంగా వాడుకుంటున్న భవంతిని ఖాళీ చేయాలని మోదీ సర్కారు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసు తమకు అందిందని, దీనికి సమాధానం కూడా పంపించామని ఆ పార్టీ నేత మోతీలాల్ వోరా వ్యాఖ్యానించారు. మరో మూడేళ్ల పాటు భవనాన్ని వాడుకునేందుకు అనుమతి కోరినట్టు తెలిపారు. ఈ భవంతిలో మొత్తం 5 ఫ్లోర్లు ఉన్నాయి. జూన్, 2010లో కాంగ్రెస్ ఇక్కడ తన కార్యాలయాన్ని ప్రారంభించింది. తొలుత మూడేళ్లకు మాత్రమే అనుమతిచ్చిన అధికారులు 2013లో ఖాళీ చేయాలని కోరగా, మరో మూడేళ్లు పొడిగించాలని ఆ పార్టీ కోరింది. దానిపై ఉత్తర్వులు రాకుండానే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పరాజయం పొందడంతో, ఈ భవనాన్ని స్వాధీనం చేసుకోవాలని సర్కారు భావిస్తోంది.