: అదుపు తప్పి ప్రజలపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు


డ్రైవర్ కంట్రోల్ తప్పిన ఒక ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. ఈ ఘటన కృష్ణాజిల్లా విజయవాడ సమీపంలోని గంగూరు వద్ద నేటి ఉదయం జరిగింది. మచిలీపట్నం నుంచి విజయవాడ వస్తున్న బస్సు స్టీరింగ్ ఫెయిల్ కావడంతో రహదారిని వదిలి ఈ బస్సు వేగంగా జనాల పైకి దూసుకురావడంతో, ఒక ద్విచక్రవాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో నలుగురికి గాయాలు కాగా, వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News