: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్... హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన కివీస్
వరల్డ్ కప్ మెగా టోర్నీలో మరికాసేపట్లో ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు ఇంగ్లండ్ తో తలపడనుంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఇదిలా ఉంటే, ఇప్పటికే రెండు వరుస విజయాలతో జోరు మీదున్న కివీస్ జట్టు మూడో విజయం సాధించి హ్యాట్రిక్ విక్టరీని నమోదు చేయాలని భావిస్తోంది. తొలి మ్యాచ్ లో శ్రీలంకను, రెండో మ్యాచ్ లో స్కాట్లాండ్ ను కివీస్ మట్టికరిపించిన సంగతి తెలిసిందే. మరోవైపు తొలి మ్యాచ్ లో ఆసీస్ చేతిలో ఘోర పరాజయం పాలైన ఇంగ్లండ్ జట్టు, ఈ మ్యాచ్ లోనైనా విజయం సాధించాలని బరిలోకి దిగుతోంది.