: బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఐఎస్ఐఎస్ లో చేరబోయి దొరికిపోయింది!


ఉన్మాదులతో నిండిపోయిన ఐఎస్ఐఎస్ టెర్రరిస్టు గ్రూపులో చేరేందుకు యువత ఆకర్షితులవుతున్నారు. ఉగ్రవాదానికి, పోరాటానికి తేడా తెలియని యువత ఐఎస్ఐఎస్ పన్నిన వలలో పడుతున్నారు. 14 ఏళ్ల మైనర్ బాలిక ఇస్లామిక్ స్టేట్ టెర్రర్ గ్రూప్ లో చేరడానికి సిద్ధమవుతూ మలేషియా పోలీసులకు చిక్కింది. దక్షిణ మలేషియాకు చెందిన ఆ బాలికను ఎయిర్ పోర్ట్ లో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐఎస్ఐఎస్ లో చేరిన తరువాత అదే ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల యువకుడ్ని పెళ్లి చేసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుందని పోలీసులు తెలిపారు. అనంతరం అతనిని కూడా ఐఎస్ఐఎస్ లో చేర్పించేందుకు సిద్ధమైనట్టు తెలిపారు. సిరియాలోని ఇద్దరు ఐఎస్ఐఎస్ మలేషియన్ మిలిటెంట్లతో ఆ యువతి టచ్ లో ఉంటున్నట్లు పోలీసులు చెప్పారు. టెర్రర్ గ్రూపులో చేరేందుకు ఆ బాలికను ప్రేరేపించిన అంశాలు ఏంటి? వీరే కాకుండా మరెవరినైనా ఐఎస్ఐఎస్ టెర్రర్ గ్రూపులో చేర్పించేందుకు ఆ బాలిక ప్రయత్నించిందా? అనే కోణంలో కూడా విచారిస్తున్నారు.

  • Loading...

More Telugu News