: మా ఎమ్మెల్యేలను కొనేందుకు మాంఝీ ప్రయత్నిస్తున్నారు: జేడీ(యూ)
బీహార్ లో ఏర్పడ్డ రాకీయ సంక్షోభం కారణంగా అసెంబ్లీలో బలనిరూపణకు ఒకే రోజు గడువు ఉండడంతో అక్కడ రాజకీయం రసకందాయంలో పడింది. మాంఝీ మద్దతుదారులు, నితీష్ మద్దతుదారులు పరస్పర విమర్శలతో ఆకట్టుకుంటున్నారు. తాజాగా మాంఝీ సర్కారుపై జేడీ(యూ) ఆరోపణలు సంధించింది. మైనార్టీలో పడ్డ మాంఝీ సర్కారు తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నిస్తోందని జేడీ(యూ) ఆరోపిస్తోంది. ఈ నెల 20న శాసనసభలో జరగనున్న విశ్వాసపరీక్షలో గట్టెక్కేందుకు తమ శాసనసభ్యులను కొనేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆ పార్టీ ధ్వజమెత్తింది.