: మడోన్నాపై వార్తలను ఖండించిన బీబీసీ రేడియో


పాప్ సింగర్ మడోనాకు వయసు ఎక్కువైన కారణంగా బీబీసీ రేడియో-1 ప్లేలిస్టు నుంచి తొలగించినట్టు వచ్చిన వార్తలను బీబీసీ ఖండించింది. ఈ వార్తలపై బీబీసీ రేడియో-1 తన ఫేస్ బుక్ పేజీలో వివరణ ఇచ్చింది. తాము ఎవరిపైనా నిషేధం విధించలేదని స్పష్టం చేసింది. రేడియో1 పాటల జాబితాను మ్యూజికల్ మెరిట్స్ ను, యువ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని ఎంపిక చేస్తామని బీబీసీ రేడియో1 తెలిపింది. తాము ఎవరిపైనా నిషేధం విధించలేదని, పుకార్లను నమ్మవద్దని బీబీసీ రేడియో1 తన ఫేస్ బుక్ పేజ్ లో వెల్లడించింది. కాగా, పాప్ సింగర్ మడోనా వయసు 56 సంవత్సరాలు.

  • Loading...

More Telugu News