: ప్రముఖ సినీ నటుడు చంద్రమోహన్ కు అస్వస్థత
ప్రముఖ సినీనటుడు చంద్రమోహన్ కు గుండెపోటు వచ్చింది. దాంతో ఆయనను హైదరాబాదు అపోలో ఆసుపత్రిలో చేర్చి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. కాగా, ఆయనకు వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తున్నట్లు తెలిసింది. చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖరరావు. 1966 నుంచి ఇప్పటివరకు ఆయన వరుసగా అనేక చిత్రాల్లో నటించారు.