: ఇక విడతలవారీగా రైల్వే 'బాదుడు'... ద్రవ్యోల్బణం ఆధారంగా హెచ్చుతగ్గులు!


ఆదాయాన్ని పెంచుకోవడంపై ప్రధాన దృష్టిని సారించిన భారతీయ రైల్వే, కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ఇకపై ప్రతి 3 నెలలకు ఒకసారి ధరల కదలికలకు అనుగుణంగా టికెట్ రేట్లు సవరించాలని భావిస్తోంది. ఈ మేరకు మిట్టల్ కమిటీ చేసిన సిఫార్సులను రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదించనున్నట్టు సమాచారం. ఆదాయ పెంపునకు ఈ కమిటీ రెండు మార్గాలను సూచించింది. నెలకు కిలోమీటరుకు 2 పైసల చొప్పున పెంచుతూ పోవాలని, లేకుంటే మూడు నెలలకు ఒకసారి ద్రవ్యోల్బణం ఆధారంగా ధరలు సవరించాలని పేర్కొంది. వీటిల్లో రెండో మార్గానికే రైల్వే మంత్రి మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News