: మోదీ వచ్చాక మార్పేం రాలేదు... అసహనం పెరుగుతోందంటున్న దీపక్ పరేఖ్
ప్రధాని నరేంద్ర మోదీ తొమ్మిది నెలల పాలనపై వ్యాపార దిగ్గజం, హెచ్ డీఎఫ్ సీ ఛైర్మన్ దీపక్ పరేఖ్ పెదవి విరిచారు. తొమ్మిది నెలల మోదీ పాలనలో భారత వ్యాపార రంగంలో ఎలాంటి మార్పు రాలేదని పరేఖ్ వ్యాఖ్యానించారు. ఈ కారణంగా భారత వాణిజ్య వర్గాల్లో అసహనం నానాటికీ పెరిగిపోతోందని కూడా ఆయన ఒకింత ఘాటుగానే స్పందించారు. భారత్ లో వ్యాపార నిర్వహణను సులభతరం చేయకుంటే, మేకిన్ ఇండియా విజయవంతం కాదని పరేఖ్ హెచ్చరించారు. ఎన్నికల సందర్భంగా మోదీ ఇచ్చిన హామీల మేరకు భారత వ్యాపార రంగం, కేంద్రం నుంచి భారీగా ఆశలు పెట్టుకుందని ఆయన నిన్న వ్యాఖ్యానించారు. అయితే వ్యాపార వర్గాలు పెట్టుకున్న ఆశలకు అనుగుణంగా పనిచేయడంలో మోదీ సర్కారు సఫలం కాలేదన్నారు. దీంతో నానాటికీ సదరు వర్గాల్లో అసహనం పెరిగిపోతోందని ఆయన అన్నారు.