: బీ కేర్ ఫుల్... టీమిండియా ఎక్కువ ప్రమాదకారి!: రీకీ పాంటింగ్


ప్రపంచ కప్ లో టీమిండియా చాలా ప్రమాదకరమైన జట్టని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ హెచ్చరించాడు. భారత జట్టులో అగ్రశ్రేణి ఆటగాళ్లు స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే టీమిండియాను ఆపే శక్తి లేదని పేర్కొన్నాడు. మెగా ఈవెంట్ లో డిఫెండింగ్ చాంపియన్ గా బరిలో దిగుతున్న ధోనీసేన టైటిల్ నిలబెట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని పాంటింగ్ ప్రత్యర్థులను హెచ్చరిస్తున్నాడు. వరల్డ్ కప్ ముందు టీమిండియా బలహీనంగా కనిపించినా, ఆత్మ స్థైర్యం పుంజుకుందని, సామర్థ్యం మేర ఆడితే ఇతర జట్లకు ప్రమాదకారి అవుతుందని పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. ప్రపంచ కప్లో భారత్ తొలి మ్యాచ్ లో పాకిస్థాన్ పై గెలవడంతో ఆత్మవిశ్వాసం ప్రోది చేసుకుందని, ఇకముందు మరింత మెరుగైన ప్రదర్శన చేస్తుందని పాంటింగ్ పేర్కొన్నాడు. టీమిండియా బౌలింగ్ ను ప్రత్యర్థులు దెబ్బతీస్తే, భారత్ కోలుకోలేదని పాంటింగ్ ఇతర జట్లకు సూచించాడు. అయితే ప్రస్తుతానికి స్వదేశంలో ఆడుతుండడంతో ఆస్ట్రేలియా జట్టే ఫేవరేట్ అని స్పష్టం చేశాడు. అయితే న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాలను కూడా తక్కువ అంచనా వేయకూడదని, వాటిపై అంచనాలు ఎక్కువ ఉండడంతో ఒత్తిడిలో తేలిపోయే అవకాశం ఉందని పాంటింగ్ జోస్యం చెప్పాడు.

  • Loading...

More Telugu News