: ఢిల్లీలో ప్రతిపక్ష నేతగా బీజేపీ నేత విజేందర్ గుప్తా
ఇటీవల బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అపూర్వ విజయం సాధిస్తే బీజేపీ నుంచి ముగ్గురు అభ్యర్థులు మాత్రమే గెలుపొందారు. దాంతో కనీసం ప్రతిపక్ష హోదాకు కావల్సిన ఏడు సీట్లు కూడా దక్కించుకోలేకపోయింది. అయితే ఉన్న ఆ ముగ్గురిలోనే అసెంబ్లీలో పార్టీ ప్రతిపక్ష నేతగా విజేందర్ గుప్తా నియమితులైనట్టు బీజేపీ సీనియిర్ నేత, ఢిల్లీ ఇన్ ఛార్జ్ ప్రభాత్ ఝా మీడియాకు తెలిపారు.