: ఆరుగురు హీరోలు, 12 మంది హీరోయిన్లు, 24 మంది దర్శకులను పరిచయం చేశారు


దగ్గుబాటి రామానాయుడు అంటే సృజనాత్మకతకు మారుపేరు. సినీ రంగంలో మార్పులను ఆకళింపు చేసుకుంటూ, ఎప్పటికప్పుడు కొత్త రక్తాన్ని ఎక్కించేవారు. టాలెంట్ ఎక్కడున్నా సరే ఆయన ప్రోత్సహించేవారు. కొత్త వాళ్లతో సినిమాలు తీయడం ఆయనకు చాలా ఇష్టం. అందుకే ఆయన ఆరుగురు హీరోలను తెలుగు చిత్రసీమకు పరిచయం చేశారు. 12 మంది హీరోయిన్లను తెలుగు తెరకు పరిచయం చేశారు. తన సినిమాల ద్వారా 24 మంది దర్శకులకు అవకాశమిచ్చి తెలుగు సినీ అభిమానులకు పరిచయం చేశారు. అలాగే ఏడుగురు మ్యూజిక్ డైరెక్టర్లను తెలుగు తెరకు పరిచయం చేశారు. చెన్నై ఆధారంగా సినీ పరిశ్రమ పనిచేస్తున్నప్పుడు హైదరాబాదు వచ్చిన ఆయన, సౌకర్యాల కల్పన కోసం రామానాయుడు స్టూడియోస్ నిర్మించారు. రామానాయుడు ఛారిటబుల్ ట్రస్టు ద్వారా ఆయన అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

  • Loading...

More Telugu News