: ఏపీ, తెలంగాణలో క్రమంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
వేసవికాలం ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. రెండు రాష్ట్రాల్లో ఉదయం వేళ ఎండలు ఠారెత్తిస్తున్నాయి. రాత్రిపూట తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏపీలోని ఆరోగ్యవరం, నందిగామలో అత్యల్పంగా 17 డిగ్రీలు నమోదుకాగా, తెలంగాణలోని ఆదిలాబాద్ లో అత్యల్పంగా 13 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మహబూబ్ నగర్ లో గరిష్ఠంగా 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతల్లో 25 డిగ్రీలకు పైగా వ్యత్యాసం ఉంది.