: భువనేశ్వర్ ఫిట్ నెస్ పై తొలగని అనిశ్చితి... దక్షిణాఫ్రికాతో మ్యాచ్ కు డౌటే!


టీమిండియా యువ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఫిట్ నెస్ పై సందేహాలు తొలగిపోలేదు. వరల్డ్ కప్ లో భారత జట్టు తదుపరి మ్యాచ్ ను పటిష్టమైన దక్షిణాఫ్రికాతో ఆడాల్సివున్న నేపథ్యంలో, భువీ విషయంలో టీమ్ మేనేజ్ మెంట్ మల్లగుల్లాలు పడుతోంది. డివిల్లీర్స్, ఆమ్లా, డికాక్, మిల్లర్, డుమినీ, డుప్లెసిస్ లతో దుర్భేద్యంగా కనిపిస్తున్న సఫారీ బ్యాటింగ్ లైనప్ ను కట్టడి చేయాలంటే పూర్తి స్థాయి బౌలింగ్ వనరులతో బరిలో దిగాల్సివుంటుంది. కొత్తబంతితో రెండు వైపులా స్వింగ్ రాబట్టడంలో భువీ దిట్ట. అటు, రివర్స్ స్వింగ్ లోనూ ప్రావీణ్యం ఉంది. దీంతో, దక్షిణాఫ్రికా తో మ్యాచ్ (ఫిబ్రవరి 22) నాటికి ఈ యువ పేసర్ పూర్తిగా సన్నద్ధమవ్వాలని టీమిండియా శిబిరం ఆశిస్తోంది. అయితే, బుధవారం నెట్ ప్రాక్టీసులో భువీ పేలవ ప్రదర్శన కనబరచడం కలవరపరుస్తోంది. దాదాపు 8 ఓవర్లు విసిరినా బ్యాట్స్ మెన్ ను ఇబ్బంది పెట్టలేకపోయాడట.

  • Loading...

More Telugu News