: 4000 పరుగుల క్లబ్బులో షకిబ్... ఈ మార్కు చేరిన తొలి బంగ్లా క్రికెటర్ గా రికార్డు


బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకిబ్ అల్ హసన్ 4000 పరుగుల క్లబ్బులో అడుగుపెట్టాడు. ఈ ఘనత సాధించిన తొలి బంగ్లాదేశ్ బ్యాట్స్ మన్ గా చరిత్రపుటల్లోకెక్కాడు. ఆఫ్ఘనిస్థాన్ జట్టుతో కాన్ బెర్రాలో జరుగుతున్న వరల్డ్ కప్ మ్యాచ్ లో షకిబ్ ఈ ఫీట్ నమోదు చేశాడు. ఆఫ్ఘన్ బౌలర్ ఆఫ్తాబ్ ఆలమ్ విసిరిన ఇన్నింగ్స్ 37వ ఓవర్ చివరి బంతిని బౌండరీకి తరలించడం ద్వారా ఈ లెఫ్ట్ హ్యాండర్ 4 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. అతని తర్వాతి తమీమ్ ఇక్బాల్ , మహ్మద్ అష్రాఫుల్, ముష్ఫికర్ రహీం, షహర్యార్ నఫీస్ ఉన్నారు. ఇక, మ్యాచ్ విషయానికొస్తే... బంగ్లాదేశ్ జట్టు 42 ఓవర్లలో 4 వికెట్లకు 209 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో షకిబ్ అల్ హసన్ 49 పరుగులతో, ముష్ఫికర్ రహీం 52 పరుగులతో ఉన్నారు.

  • Loading...

More Telugu News