: ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ అసాధ్యమని నేనెప్పుడూ చెప్పలేదు: వెంకయ్యనాయుడు


ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ విషయంలో కాంగ్రెస్ ఆరోపణలపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు విరుచుకుపడ్డారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ అసాధ్యమని వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించినట్లు రెండు రోజుల క్రితం వార్తా కథనాలు వెలువడ్డ సంగతి తెలిసిందే. వీటిపై కాంగ్రెస్ నేతలు విరుచుకుపడ్డారు. విభజన చట్టంలోనూ ఏపీకి ప్రత్యేక హోదా ఉందని, దానిని అమలు చేయడంలో కేంద్రం కుంటి సాకులు వెతుకుతోందని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఆరోపించారు. రఘువీరా ఆరోపణలపై కొద్దిసేపటి క్రితం వెంకయ్యనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి పత్ర్యేక ప్యాకేజీ అసాధ్యమంటూ తానెప్పుడూ వ్యాఖ్యానించలేదని వెంకయ్య స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని విభజన చట్టంలో ఎక్కడుందో చెప్పాలని వెంకయ్య డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News