: ఇంత అరాచకమా?.. టీఆర్ఎస్ సర్కారుపై గుత్తా ధ్వజం


తెలంగాణలో టీఆర్ఎస్ సర్కారు అరాచకాలకు పాల్పడుతోందని కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. నేటి ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా మారారని ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చి 9 నెలలు గడిచినప్పటికీ, ప్రభుత్వం చేసిందేమీ లేదని అన్నారు. ప్రజలకు ఎన్నో వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ ఇప్పటిదాకా ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ఆయన ఆరోపించారు. ఢిల్లీ, ముంబైలకు ఆయన పర్యటనలు వ్యక్తిగత ప్రయోజనాల కోసమేనని గుత్తా విమర్శించారు.

  • Loading...

More Telugu News