: ఈ యాప్ ఆత్మహత్యలను నివారిస్తుందట!


మొబైల్ అప్లికేషన్ల ప్రపంచంలో మరో కొత్త యాప్ రంగప్రవేశం చేసింది. ఇది ఆత్మహత్యలను నివారించడానికి ఉపయోగపడుతుందని రూపకర్తలు అంటున్నారు. ఓ చెక్ లిస్టు సాయంతో వ్యక్తుల మానసిక స్థితిని అంచనా వేయడం ద్వారా వారిలో ఆత్మహత్య ఆలోచనలను ఇది పసిగడుతుందట. డిప్రెషన్ లో ఉన్నవారిని గుర్తించి, వెంటనే వారిని నేషనల్ సూసైడ్ ప్రివెన్షన్ లైఫ్ లైన్ కి అనుసంధానిస్తుంది. తద్వారా, వ్యక్తులకు సరైన సమయంలో కౌన్సెలింగ్ లభిస్తుంది. ఈ సరికొత్త యాప్ పేరు 'హోప్'. అమెరికాలోని బ్రూమ్ కౌంటీ ఈ యాప్ ను ప్రవేశపెట్టింది. ఆండ్రాయిడ్, ఐఫోన్లలో దీన్ని ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ అందించే సమాచారాన్ని 'లైఫ్ లైన్' విశ్లేషించి అవసరమైన వారికి కౌన్సెలింగ్ ఇస్తుంది.

  • Loading...

More Telugu News