: శ్రీవారిని దర్శించుకున్న శ్రీలంక అధ్యక్షుడు
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన దర్శించుకున్నారు. ఈ ఉదయం సతీమణి జయంతితో కలసి స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. ముందుగా వైకుంఠం క్యూకాంప్లెక్స్ వద్దకు చేరుకున్న సిరిసేనకు మహాద్వారం వద్ద టీటీడి ఈవో సాంబశివరావు, జేఈవో శ్రీనివాసరాజు స్వాగతం పలికారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో సిరిసేన దంపతులకు పండితులు ఆశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. అదే సమయంలో తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటం, కాలమాన పట్టికను వారికి ఈవో అందించారు.