: పెళ్ళికొడుకును కాదని అతిథిగా వచ్చిన యువకుడిని వరించిన వధువు


సగానికి పైగా పెళ్లి తంతు పూర్తయ్యాక పెళ్లి కొడుకులో ఉన్న అనారోగ్యం గురించి తెలుసుకున్న వధువు, అదే మండపంలో వివాహం చూసేందుకు వచ్చిన మరో యువకుడిని వరించింది. సగటు సినిమా కథకు ఎంతమాత్రమూ తీసిపోని ఈ ఘటన యూపీలోని మొరాదాబాద్ సమీపంలో జరిగింది. జుగల్ కిశోర్ (23) అనే యువకుడికి ఇందిర (23)తో పెళ్లి కుదిరింది. పెళ్లి తంతులో భాగంగా దండలు మార్చుకుంటుండగా, స్టొరీ మారిపోయింది. మూర్ఛరోగంతో బాధపడుతున్న కిశోర్ వధువుకు వరమాల వేస్తూ, ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అతనికి ఉన్న రోగాన్ని దాచిపెట్టి వివాహం జరుపుతారా? అని వరుడి కుటుంబ సభ్యులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తనను మోసం చేసిన వారికి బుద్ధి చెప్పేందుకు తన పెళ్లికి అతిథిగా వచ్చిన హర్పాల్ సింగ్ అనే యువకుడిని వరించింది. హర్పాల్ మొదట ఆశ్చర్యానికి గురైనా తర్వాత అంగీకరించాడు. దీంతో అక్కడిక్కడే వారి పెళ్లి జరిగిపోయింది. ఆసుపత్రిలో కోలుకున్న అనంతరం కిషోర్ తిరిగొచ్చి భయపెట్టినా ఇందిర ధైర్యంగా నిలిచింది. కిషోర్ బంధువులు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసినప్పటికీ, పెద్దలు వారించడంతో వారు ఆ ఫిర్యాదును వెనక్కు తీసుకోవడంతో ఇందిర పెళ్లి కథ సుఖాంతమైంది.

  • Loading...

More Telugu News