: పదేళ్లలో వైమానిక రంగంలో 2 లక్షల ఉద్యోగాలు... ఏరో ఇండియాలో ప్రధాని మోదీ
రానున్న పదేళ్లలో వైమానిక రంగంలో 2 లక్షల మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కొద్దిసేపటి క్రితం బెంగళూరులో ఏరో ఇండియా ప్రదర్శనను మోదీ ప్రారంభించారు. మేకిన్ ఇండియాలో రక్షణ రంగానిదే కీలక భూమిక అని ఈ సందర్భంగా మోదీ ప్రకటించారు. రక్షణ రంగంలోనూ వైమానిక రంగం ప్రధాన భూమిక పోషించనుందని ఆయన వ్యాఖ్యానించారు. రక్షణ రంగంలో మరింత అభివృద్ధి సాధించేందుకు శాస్త్రవేత్తలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఏరో ఇండియా ప్రదర్శన భారత రక్షణ రంగ తయారీకి వేదికగా నిలువనుందని కూడా మోదీ అన్నారు. రక్షణ రంగ కొనుగోళ్లలో మరిన్ని సంస్కణలను ప్రవేశపెట్టనున్నామని ఆయన తెలిపారు.