: విజయనగరం జడ్పీ సీఈఓ ఇంటిలో చోరీ... 20 తులాల బంగారం ఎత్తుకెళ్లిన దొంగలు
విజయనగరం జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణాధికారి (సీఈఓ) ఇంటిలో రాత్రి దొంగలు పడ్డారు. జడ్పీ సీఈఓగా పనిచేస్తున్న రాజకుమారి నివాసంలోకి రాత్రి చొరబడ్డ దొంగలు 20 తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. చోరీ జరిగిన విషయాన్ని గుర్తించిన రాజకుమారి విజయనగరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజకుమారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు ప్రారంభించారు.