: పూచీకత్తుకే దిక్కులేదు... డిపాజిట్లెలా చెల్లిస్తారు?: సహారా చీఫ్ కు సుప్రీం ప్రశ్న


బెయిల్ కోసం డిపాజిట్ చేయమన్న రూ.10 వేల కోట్లకే దిక్కు లేదు... ఇక డిపాజిటర్లకు సొమ్ములెలా చెల్లిస్తారని సుప్రీంకోర్టు ధర్మాసనం సహారా ఇండియా చీఫ్ సుబ్రతో రాయ్ ను ప్రశ్నించింది. బెయిల్ కోసం కోర్టు అడిగిన నిధులను సమీకరించేందుకు సుబ్రతో రాయ్ కి కల్పిస్తున్న ప్రత్యేక వసతులను మరో 4-6 వారాల పాటు కొనసాగించాలన్న సహారా పిటిషన్ ను నిన్న జస్టిస్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా ధర్మాసనం పలు ప్రశ్నలను పిటిషనర్ తరఫు న్యాయవాదికి సంధించింది. ‘‘బెయిల్ కోసం రూ.10 వేల కోట్ల సేకరణకే నానా పాట్లు పడుతున్నారు. బయటకొచ్చాక డిపాజిటర్లకు చెల్లించాల్సిన రూ.30 వేల కోట్లను ఎలా చెల్లిస్తారు?’’ అంటూ కోర్టు నిలదీసింది. ఇదిలా ఉంటే ఈ కేసులో తనను కూడా ఇంప్లీడ్ చేసుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోర్టును కోరింది.

  • Loading...

More Telugu News