: టీమిండియాలో సత్తా కలిగిన ఆటగాళ్లు... ఈ సారీ వరల్డ్ కప్ భారత్ దే: హర్భజన్ సింగ్


భారత క్రికెట్ జట్టు మాజీ సభ్యుడు హర్భజన్ సింగ్, వరల్డ్ కప్ కు వెళ్లిన టీమిండియా జట్టు కూర్పుపై సంతృప్తి వ్యక్తం చేశాడు. జట్టులో సరైన ఆటగాళ్లే ఉన్నారన్న అతడు, జట్టులోని సభ్యులంతా సత్తా గలవారేనని వ్యాఖ్యానించాడు. ఈ సారి వరల్డ్ కప్ కూడా భారత్ దేనని అతడు వ్యాఖ్యానించాడు. మెగా టోర్నీ ముగిసిన తర్వాత ట్రోఫీతోనే ధోనీ సేన స్వదేశంలో అడుగుపెడుతుందని కూడా హర్భజన్ చెప్పాడు. ఫేస్ బుక్ చాట్ ద్వారా నిన్న ఆజ్ తక్ నిర్వహించిన కార్యక్రమంలో శ్రోతలడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చిన సందర్భంగా హర్భజన్ టీమిండియాపై విశ్వాసం వుంచాడు. 2011 వరల్డ్ కప్ ఆడిన భారత జట్టులో హర్భజన్ కూడా సభ్యుడిగా ఉన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News