: డ్యాన్సులకు అనుమతివ్వాలంటూ భక్తుల ఆందోళన... మంత్రి జోక్యం
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కోటప్పకొండ త్రికూటేశ్వరస్వామి వద్దకు భక్తులు భారీ ప్రభలతో తరలివస్తారు. ఈ ప్రభల ముందు డ్యాన్సులు ఏర్పాటు చేయడం తెలిసిందే. అయితే, డ్యాన్సులకు పోలీసులు అనుమతించకపోవడంతో గుంటూరు జిల్లా యడవల్లి వద్ద ప్రభలను నిలిపివేసిన భక్తులు ధర్నాకు దిగారు. మంత్రి పత్తిపాటి పుల్లారావు జోక్యం చేసుకోవడంతో వ్యవహారం సద్దుమణిగింది. భక్తులు ఆందోళన విరమించారు. అశ్లీలతకు తావులేకుండా డ్యాన్సులు నిర్వహించుకోవాలని మంత్రి స్పష్టం చేశారు.