: టేలర్ అవుట్... మూడో వికెట్ కోల్పోయిన కివీస్


పసికూన స్కాట్లాండ్ తో పోరులో న్యూజిలాండ్ లక్ష్యఛేదన దిశగా సాగుతోంది. 143 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన కివీస్ 15 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేశారు. స్టార్ బ్యాట్స్ మన్ రాస్ టేలర్ 9 పరుగులు చేసి హక్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. ఆతిథ్య జట్టు విజయం సాధించాలంటే ఇంకా 52 పరుగులు చేయాలి. 35 ఓవర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం క్రీజులో విలియమ్సన్ (33 బ్యాటింగ్), ఇలియట్ (12 బ్యాటింగ్) ఉన్నారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ 36.2 ఓవర్లలో 142 పరుగులకు ఆలౌటైంది.

  • Loading...

More Telugu News