: ఈశాన్య జపాన్ లో భూకంపం... సునామీ హెచ్చరిక


జపాన్ లో భూకంపం సంభవించిన నేపథ్యంలో సునామీ హెచ్చరిక జారీ చేశారు. ఈశాన్య జపాన్ లో మంగళవారం 6.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో, సునామీ వచ్చే అవకాశం ఉందని జపాన్ వాతావరణ సంస్థ హెచ్చరించింది. కాగా, 2011లో జపాన్ లో సునామీ రావడంతో ఫుకుషిమా అణు కేంద్రం దెబ్బతిన్న సంగతి తెలిసిందే. 15 మీటర్ల ఎత్తున విరుచుకుపడిన రాకాసి అల అణు కేంద్రానికి సంబంధించిన విద్యుత్, శీతలీకరణ వ్యవస్థలను ఛిన్నాభిన్నం చేసింది. దీంతో, ప్రపంచవ్యాప్తంగా అణు కేంద్రాల భద్రతపై ఆందోళన మొదలైంది. భారత్ లోనూ కుడంకుళం అణు విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు పలు సంఘాలు విముఖత వ్యక్తం చేశాయి.

  • Loading...

More Telugu News