: పెళ్లి జరిగిన కాసేపటికే వధువును చితకబాదాడు!
వివాహం... ప్రపంచంలో ఎక్కడైనా దీని ఉద్దేశం ఒక్కటే. ఆడామగా కలిసి జీవించేందుకు ఓ రకంగా ఇది లైసెన్స్ అనుకోవచ్చు. అందుకే పెళ్లి ఘడియలను ఎంతో అపురూపంగా భావిస్తారు. కానీ, ఇంగ్లండ్ లోని డుర్హామ్ లో గావిన్ గోలిట్లీ (29) అనే యువకుడు మాత్రం పెళ్లి జరిగిన రోజు రాత్రే వధువు అమీ డాసన్ (22)కు నరకం చూపించాడు. కారణమేంటో తెలుసా?... వెడ్డింగ్ గౌను మార్చుకోవడంలో సాయం చేయమని ఆమె గావిన్ ను అడగడమే. విచక్షణరహితంగా అతడు చితకబాదడంతో ఆమె అక్కడి నుంచి తప్పించుకుని, పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కోర్టు విచారణ జరిపి రెండేళ్ల పాటు సామాజిక సేవ చేయాలని గావిన్ ను ఆదేశించింది. తనకు మాదకద్రవ్యాలు అలవాటయ్యాయని, వాటి ప్రభావంతోనే అలా ప్రవర్తించానని ఆ యువకుడు కోర్టుకు విన్నవించినా, న్యాయమూర్తి వినిపించుకోలేదు.