: గెలుపు సంబరాలు యూపీలో కొట్లాటకు దారితీశాయి!
వరల్డ్ కప్ లో పాకిస్థాన్ జట్టుపై భారత్ గెలిచిన తర్వాత దేశంలో సంబరాలు అంబరాన్నంటడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఉత్తరప్రదేశ్ లోని బలియా జిల్లాలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. టీమిండియా విజయాన్ని ఫ్యాన్స్ బాణాసంచా పేల్చడం, రోడ్లపై డ్యాన్సులు చేయడం ద్వారా సెలబ్రేట్ చేసుకుంటుండగా, కొందరు యువకులు వారిపై రాళ్లు రువ్వారు. అంతటితో ఆగకుండా, టీమిండియా అభిమానులను కొట్టి, ఓ బైక్ ను దగ్ధం చేశారు. బాణాసంచా కాల్చవద్దని, తన షాపులో ఉన్న పత్తి కాలిపోతుందని ఓ దుకాణదారు ఫ్యాన్స్ ను కోరడంతో గొడవ మొదలైందని పోలీసులు తెలిపారు. ఈ ఘర్షణలో పలువురికి గాయాలవగా, అక్కడికి అదనపు బలగాలను తరలించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉన్నట్టు తెలిసింది.