: హోటల్ గదులకే పరిమితమైన టీమిండియా


దాయాది పాకిస్థాన్ తో పోరులో అద్భుత విజయాన్నందుకున్న టీమిండియా సంబరాలకు దూరంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా భారతీయులందరూ వరల్డ్ కప్ లో పాక్ పై ధోనీ సేన విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడం తెలిసిందే. అయితే, అడిలైడ్ లో ఆదివారం మ్యాచ్ ముగిసిన వెంటనే టీమిండియా ఆటగాళ్లు నేరుగా హోటల్ కు వెళ్లిపోయారు. ఎలాంటి సంబరాలు చేసుకోకుండా, గదులకే పరిమితమయ్యారు. దీనిపై, జట్టు సహాయక బృందంలోని ఓ సభ్యుడు మాట్లాడుతూ, సంబరాలు చేసుకోవాల్సిన పనిలేదని, తామేమీ వరల్డ్ కప్ నెగ్గలేదని, టోర్నీలో తొలి మ్యాచ్ లోనే గెలిచామని పేర్కొన్నారు. పాక్ పై నెగ్గినందుకు అందరూ హర్షం వ్యక్తం చేశారని తెలిపారు. ప్రస్తుతం భారత జట్టు మెల్బోర్న్ లో ఉంది.

  • Loading...

More Telugu News