: క్యాన్సర్ తో బాధపడుతున్న మాజీ కేంద్రమంత్రి ఆర్‌ఆర్ పాటిల్ కన్నుమూత
మాజీ కేంద్రమంత్రి, మహారాష్ట్ర మాజీ హోం మంత్రి, ఎన్‌సీపీ నేత ఆర్.ఆర్. పాటిల్ ఈ సాయంత్రం ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆయన నోటి క్యాన్సర్ తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. రోజులు గడుస్తున్న కొద్దీ ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించగా, తమవంతు ప్రయత్నం చేసినప్పటికీ కాపాడలేకపోయామని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. మహారాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన ఆయన, 2011లో ముంబైలో బాంబు పేలుళ్లు జరిగిన సమయంలో హోం మంత్రిగా పనిచేశారు.