: ఎంసీసీ జీవితకాల సభ్యుడిగా గంగూలీ


టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్ఠాత్మక మెరిల్ బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) గంగూలీకి గౌరవ లైఫ్ టైమ్ సభ్యత్వం అందిస్తున్నట్టు తెలిపింది. ఎంసీసీ ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన చేసింది. ఎంసీసీ ప్రధాన కార్యాలయం విఖ్యాత లార్డ్స్ మైదానంలో ఉంది. దీనిపై గంగూలీ స్పందిస్తూ, తనకు ఈ గౌరవం దక్కడం సంతోషదాయకమన్నాడు. అందుకు ఎంసీసీకి కృతజ్ఞతలు తెలిపాడు. లార్డ్స్ లో తనకు ఎన్నో మధురానుభూతులు ఉన్నాయని దాదా పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News