: రజనీకాంత్ ఇంటిముందు అడుక్కుంటూ ఆందోళన... 'లింగ' డిస్ట్రిబ్యూటర్లు


గత నెలలో విడుదలై భారీ నష్టాలు చవిచూసిన 'లింగ' చిత్రాన్ని కొన్న డిస్ట్రిబ్యూటర్లు తమ నష్టాలు భరించాలని డిమాండ్ చేస్తూ, వినూత్న రీతిలో ఆందోళన చేపట్టాలని నిర్ణయించారు. డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యజమానులు అందరూ కలిసి హీరో రజనీకాంత్ ఇంటిముందు అడుక్కుంటూ ఆందోళన చేసేందుకు సిద్ధపడుతున్నామని తెలిపారు. నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ తొలుత పది శాతం పరిహారం చెల్లించేందుకు అంగీకరించి, ఇపుడు నిరాకరిస్తున్నాడని డిస్ట్రిబ్యూటర్ వడివేలన్ ఆరోపించారు. తాము అడుగుతున్న నష్టపరిహారం రజనీకాంత్ కు చెల్లించిన పారితోషికం కన్నా చాలా తక్కువేనని, తక్షణం స్పందించకుంటే, రేపటి నుంచి రజనీకాంత్ ఇంటిముందు అడుక్కుంటూ సాగేలా తమ ఆందోళన మొదలు పెట్టబోతున్నట్టుగా తెలిపారు.

  • Loading...

More Telugu News