: 21.5 కోట్ల మంది భారతీయుల వద్ద నయాపైసా ఆస్తి లేదు!


ఇండియాలో నివసిస్తున్న వారిలో 21.5 కోట్ల మంది వద్ద ఒక్క రూపాయి విలువైన ఆస్తి కూడా లేదట. ఈ మేరకు కేంద్రం నేడు అధికారిక గణాంకాలు విడుదల చేసింది. ప్రభుత్వం ఆస్తులుగా గుర్తించిన టీవీ, మోటార్ సైకిల్, మొబైల్ ఫోన్ వంటి 7 ఆర్థిక విలువను సూచించే ఐటమ్స్ లేని వారి లెక్కలను వెలువరించింది. మొత్తం జనాభా లెక్కల ప్రకారం 4.3 కోట్ల కుటుంబాల వద్ద నయాపైసా ఆస్తిలేదని తెలిపింది. వీరిలో 1.6 కోట్ల కుటుంబాలు ఆదివాసీలవేనని పేర్కొంది. వీరితో పోలిస్తే దళితులు, ముస్లిం కుటుంబాలు మెరుగైన జీవనం సాగిస్తున్నాయని తెలిపింది. ఆదివాసీల్లో 60 శాతంకన్నా తక్కువగా అక్షరాస్యత ఉందని, వీరిలో కేవలం 40 శాతం మంది మాత్రమే పక్కా గృహాలలో నివసిస్తున్నారని, జాతీయ సరాసరి కన్నా ఇది 53 శాతం తక్కువని తెలిపింది. షెడ్యూల్ కులాలు, తెగల వారి సంక్షేమానికి కేటాయించిన వేల కోట్ల రూపాయల నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర కార్యక్రమాలకు వాడటమే వెనుకబాటుతనానికి కారణమని నిపుణులు వ్యాఖ్యానించారు. కాగా, 2014-15 బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి 82,935 కోట్ల రూపాయలను కేటాయించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News