: మహా శివుడిని ఇలా పూజించండి... కరుణిస్తాడు!


హిందూ పండుగలలో మహాశివరాత్రి ప్రశస్తమైనది. ప్రతీ ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్రలోకి ప్రవేశించే సమయంలో వస్తుంది. శివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉన్నది. పరమ పవిత్రమైన శివరాత్రినాడు మహా శివుడిని భక్తితో పూజించేవారికి సకల శుభాలూ కలుగుతాయని భక్తుల విశ్వాసం. సూర్యోదయానికి ముందే స్నానం చేసి శివనామస్మరణలో నిమగ్నం అయ్యేవారిని పరమశివుడు తప్పక కరుణిస్తాడని నమ్మకం. ఇక శివ పూజా విధానాన్ని గమనిస్తే, ఆయనకు అభిషేకాలు, బిల్వ పత్రాలు, భస్మం (విభూది) అంటే అమిత ఇష్టం. శివలింగానికి నీరు, పాలు, తేనె, నెయ్యి, పెరుగు తదితరాలతో అభిషేకం చేసి, ఆపై బిల్వ పత్రాలు, విభూదితో అలంకరించి, ధూప దీపారాధన, నైవేద్యం పెడితే చాలు, కష్టాల్లో శివుడి అండ లభిస్తుందని హిందూ పురాణాలు వెల్లడిస్తున్నాయి. ఇక శివరాత్రి రోజు ఉపవాసం, రాత్రిపూట జాగారం చేస్తే మరింత పూజాఫలం దక్కుతుంది.

  • Loading...

More Telugu News