: తిరుపతి ఉపఎన్నికలో ఎవరెవరికి ఎన్ని ఓట్లు?
తిరుపతి ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. టీడీపీపై పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేక, చతికిలపడింది. కాంగ్రెస్ తో పాటు ఎన్నికలో పోటీ చేసిన అభ్యర్థులందరూ తమ డిపాజిట్లు కోల్పోవడం గమనార్హం. వివిధ పార్టీల అభ్యర్థులు సాధించిన ఓట్ల వివరాలు ఇవే. టీడీపీ అభ్యర్థి సుగుణమ్మ 1,16,524 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. సుగుణమ్మకు మొత్తం మీద 1,26,152 ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్ అభ్యర్థి శ్రీదేవికి 9,628 ఓట్లు పడగా, లోక్ సత్తా అభ్యర్థి 3,819 ఓట్లు సాధించారు. ఇండిపెండెంట్ అభ్యర్థి పోతిరెడ్డి 3,156 ఓట్లు దక్కించుకున్నారు.