: మహారాష్ట్రలో కాల్పుల కలకలం... టోల్ గేట్లపై ఉద్యమిస్తున్న సీపీఐ నేతకు తీవ్రగాయాలు
మహారాష్ట్రలో కొద్దిసేపటి క్రితం చోటుచేసుకున్న కాల్పుల ఘటన కలకలం రేపింది. సీపీఐ నేత గోవిందరావు పన్నారేపై గుర్తు తెలియని దుండగులు కాల్పులకు దిగారు. కొల్హాపుర్ లో జరిగిన ఈ ఘటనలో పన్సారేకు తీవ్ర గాయాలయ్యాయి. కాల్పుల్లో గాయపడిన పన్సారేను హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. టోల్ గేట్ల అక్రమాలపై పన్సారే పలు ఆందోళనలు చేశారు. ఈ నేపథ్యంలో పన్సారేపై కాల్పులకు పాల్పడిన వ్యక్తులు టోల్ గేట్ల యాజమాన్యాలకు చెందిన వారే అయి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.