: ప్రముఖ నటి మనోరమ చనిపోయారన్న వార్తలు అవాస్తవం


వేయికి పైగా సినిమాలలో నటించిన ప్రముఖ దక్షిణాది నటి మనోరమ చనిపోయారన్న వార్తలు తమిళనాట వెల్లువెత్తాయి. ఈ వార్తలతో సినీ రంగం సైతం విస్తుపోయింది. ఆమె మరణం నిజమా? కాదా? అని నిర్ధారించుకునేందుకు తమిళ సినీ ప్రముఖులు సైతం ఎవరెవరికో ఫోన్లు చేశారు. చివరకు ఈ వదంతులపై ఆమె కుమారుడు భూపతి స్పందించారు. ఈ వదంతులు ఎందుకు వ్యాపించాయో తమకు అర్థం కావడం లేదని ఆయన చెప్పారు. ఈ వార్తల్లో వాస్తవం లేదని, ఆమె క్షేమంగానే ఉన్నారని స్పష్టం చేశారు. అయితే, చాలా కాలంగా ఆమె అనారోగ్యంతో ఉన్నారన్న వార్తలు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే, కొంత కాలం క్రితం మనోరమ అనే బాలీవుడ్ నటి మరణించారని, ఆ వార్త ఇప్పుడు ఫేస్ బుక్ లో వచ్చిందని... ఆ వార్తను చూసిన ప్రజలు దక్షిణాది నటి మనోరమ అని పొరపాటు పడి ఉంటారని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News