: దినేశ్ కార్తీక్ రేటు రూ.10.5 కోట్లు... పీటర్సన్ గ్రాఫ్ డౌన్!


దేశవాళీ క్రికెట్ కే పరిమితమైన దినేశ్ కార్తీక్ కు వరుసగా రెండో ఏడాది కూడా ఐపీఎల్ వేలంలో భారీ ధర పలికింది. టీమిండియాలో చోటు కోసం విఫలయత్నం చేస్తున్న అతడిని కొనుగోలు చేసేందుకు ఐపీఎల్ ఫ్రాంచైజీలు అమితాసక్తి కనబరిచాయి. గతేడాది రూ.12.5 కోట్ల ధర పలికిన అతడు, తాజా ఐపీఎల్-8 వేలంలో రూ.10.5 కోట్ల ధర పలికాడు. గత సీజన్ లో రూ.12.5 కోట్లు చెల్లించి కార్తీక్ ను ఢిల్లీ డేర్ డెవిల్స్ సొంతం చేసుకోగా, ఈసారి అతడిని రూ.10.5 కోట్లకు బెంగళూరు రాయల్ చాలెంజర్స్ కొనుగోలు చేసింది. ఇదిలా ఉంటే, ప్రపంచ క్రికెట్ లో మ్యాచ్ విన్నర్లుగా పేరుగాంచిన పలువురికి నేటి వేలంలో అంతగా ధర పలకలేదు. ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్ మన్ కెవిన్ పీటర్సన్ ను కేవలం రూ.2 కోట్లు చెల్లించి హైదరాబాదు జట్టు సొంతం చేసుకుంది.

  • Loading...

More Telugu News