: ఓటమిని ద్వేషిస్తా, గెలుపును ప్రేమిస్తా... పాక్ తో మ్యాచ్ తరువాత కోహ్లీ తొలి స్పందన
తనముందు ఏదైనా సవాల్ ఉన్నప్పుడు దానిపైనే దృష్టి పెడతానని, మిగతా వాటి గురించి పట్టించుకోనని భారత క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు. పాకిస్తాన్ తో మ్యాచ్ అనంతరం కోహ్లీ తన స్పందన తెలియజేశాడు. పాక్ తో మ్యాచ్ అంటే తమపై అంచనాలు తారస్థాయిలో ఉంటాయని, తాము గెలవాలని అంతా కోరుకుంటారని చెబుతూ, 'ఓటమిని ద్వేషిస్తా, గెలుపును ప్రేమిస్తా'నని అన్నాడు. 'బ్యాట్స్ మెన్ గా మంచి ఇన్నింగ్స్ నిర్మించడం నా బాధ్యత. శిఖర్ ధావన్, సురేశ్ రైనా లాంటి హిట్టర్లు విజృంభించడంతో నా పని సులువయింది. రైనా బ్యాటింగ్ బాగుంది. మొత్తానికి ఇది గుడ్ బ్యాటింగ్ షో' అని కోహ్లి వ్యాఖ్యానించాడు.