: సంక్షేమ పథకాలకు సాయం చేయండి... నేడు ప్రధానితో భేటీ కానున్న తెలంగాణ సీఎం


తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో భాగంగా నేడు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతితోనూ భేటీ కానున్నారు. ప్రధానితో భేటీ సందర్భంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆర్థిక సాయం అందించాల్సిందిగా కేసీఆర్ కేంద్రాన్ని కోరనున్నారు. కాకతీయ మిషన్ పైలాన్ ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ఆయన కేంద్ర మంత్రి ఉమా భారతిని కోరనున్నారు. నల్లగొండ జిల్లాలో ఏర్పాటు చేసిన మిషన్ పైలాన్ ను ఉమా భారతి చేత ప్రారంభింపజేయాలని కేసీఆర్ ఇదివరకే నిర్ణయించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News