: తిరుపతిలో సైకిల్ జోరు... భారీ ఆధిక్యం దిశగా పార్టీ అభ్యర్థి సుగుణమ్మ
తిరుపతి ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో సైకిల్ జోరు కొనసాగుతోంది. నేటి ఉదయం ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో రెండు రౌండ్లు పూర్తయ్యేసరికే టీడీపీ అభ్యర్థి సుగుణమ్మ 13,631 ఓట్ల ఆధిక్యం సాధించారు. తొలి రౌండ్ తో పాటు రెండో రౌండ్ లోనూ పార్టీ అభ్యర్థికి భారీ ఆధిక్యం లభించిన నేపథ్యంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆనందంలో తేలియాడుతున్నారు. తమ పార్టీ అభ్యర్థికి లక్ష పై చిలుకు ఓట్ల మెజారిటీ ఖాయమని వారు చెబుతున్నారు. ఇదిలా ఉంటే, రెవెన్యూ, పోలీసు అధికారుల మధ్య జరిగిన స్వల్ప వివాదం నేపథ్యంలో ఓట్ల లెక్కింపు నిర్దేశిత సమయానికంటే కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది.