: ఐర్లాండ్ విజయ లక్ష్యం 305... తడబడ్డా కుదురుకున్న విండీస్


ఐసీసీ వన్డే వరల్డ్ కప్ లో భాగంగా నేటి తెల్లవారుజామున ప్రారంభమైన మ్యాచ్ లో తొలుత తడబడ్డా, ఆ తర్వాత విండీస్ బ్యాట్స్ మన్ కుదురుకున్నారు. సిమన్స్, స్యామీల సమయోచిత బ్యాటింగుతో వెస్టిండీస్ భారీ స్కోరు సాధించింది. 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసిన విండీస్ జట్టు, ఐర్లాండ్ కు 305 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. విండీస్ స్టార్ బ్యాట్స్ మన్ సిమన్స్ సెంచరీతో చెలరేగిపోయాడు. మొత్తం 83 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో వీరవిహారం చేసిన సిమన్స్ 102 పరుగులు సాధించాడు. స్యామీ (89) కూడా అర్ధ సెంచరీతో రాణించాడు. ఐర్లాండ్ బౌలర్లలో డాక్ రెల్ మూడు వికెట్లు పడగొట్టాడు.

  • Loading...

More Telugu News