: పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు


పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా పెరిగాయి. లీటర్ పెట్రోల్ పై 82 పైసలు, లీటర్ డీజిల్ పై 61 పైసలు పెంచారు. ఈ మేరకు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు నిర్ణయించాయి. ఈ ధరల పెంపుపై రాజకీయ పార్టీల స్పందన తెలియాల్సి ఉంది. కాగా, పెట్రోల్, డీజిల్ పై కేంద్రం ఎక్సైజ్ పన్ను పెంచడంతో వినియోగదారుడికి దక్కాల్సిన ప్రయోజనంలో కోత పడుతోంది. అటు, కొన్ని రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ ను పెంచడం కూడా వినియోగదారుడికి భారంగా పరిణమిస్తోంది. ఇటీవలే కేసీఆర్ సర్కారు పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ ను పెంచుతున్నట్టు ప్రకటించడం తెలిసిందే.

  • Loading...

More Telugu News